Share News

Puvvada Ajay: మా స్కీమ్‌లనే కాపీ కొట్టి.. రివర్స్‌గా మమ్మలే అంటున్నారు

ABN , First Publish Date - 2023-10-17T11:28:49+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Puvvada Ajay: మా స్కీమ్‌లనే కాపీ కొట్టి.. రివర్స్‌గా మమ్మలే అంటున్నారు

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం బీఆర్ఎస్ భవన్‌‌లో ఆ పార్టీ అభ్యర్థుల మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ... అన్ని సర్వేలు తమకు అనుకూలంగానే ఉన్నాయన్నారు. మూడవ సారి కేసీఆర్ (CM KCR) హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు. ఇప్పటికే మాది మొదటి విడత ప్రచారం కూడా ముగిసిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ (Congress) ఇప్పటి వరకు రెండు స్థానాలే ప్రకటించిందన్నారు. ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని కోరారు. గత రెండు ఎన్నికల్లో ఒకే స్థానం గెలిపించిన కేసీఆర్‌ ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ‘‘మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నే. మా స్కీమ్‌లను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రివర్స్‌గా మేమే కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నారని కొత్త డ్రామాలాడుతున్నారు. అంతే కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టింది’’ అంటూ విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై జనం నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T11:28:49+05:30 IST