Puvvada Ajay: ఖమ్మంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2023-07-07T11:22:00+05:30 IST
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
ఖమ్మం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మంత్రి హరీష్‌రావు సూచనతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ ప్రారంభించానని తెలిపారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా నేరమన్నారు. యువతకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి అని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నానని అన్నారు. లైసెన్స్ పొందటానికి అవసరమైన ఫీజు తానే చెల్లిస్తానని.. ఎవరూ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ లైసెన్స్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. ముందు లెర్నింగ్ లైసెన్స్ ఆ తరువాత పర్మినెంట్ లైసెన్స్ అందజేస్తారన్నారు. యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. డ్రైవింగ్‌పై అవగాహనతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌పై యువతకు అవగాహన కల్పిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.