Khammam Dist... ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు: మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2023-07-28T12:58:41+05:30 IST
ఖమ్మం జిల్లా: వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం ఖమ్మంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఖమ్మం జిల్లా: వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం (NDRF Team) రక్షించింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) శుక్రవారం ఖమ్మంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ప్రెస్ మీట్ (Press Meet) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించారు. మున్నేరు చరిత్రలో ఇంత వరద ఉధృతి చూసింది ఇదే ప్రథమం అని అన్నారు. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా వెళ్ళిందన్నారు. ఎవరు ఊహించని విధంగా వరద ఉధృతి వచ్చిందన్నారు. 26 అడుగులు దాటి వరద ఉదృతి ఎప్పుడు రాలేదు కానీ ఈ సారి 30 అడుగులపైన వరద ఉధృతి వచ్చిందన్నారు.
కొత్తగూడెం కోసం వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మంకు తీసుకుని వచ్చామని మంత్రి పువ్వాడ తెలిపారు. వారు వచ్చే సమయానికి చీకటి పడిందని ఆ సమయంలో కాపాడతారో లేదో అనుకున్నాం.. కానీ వారు అందరినీ రక్షించారని కొనియాడారు. 6 నెలల పాప నుంచి వృద్ధుల వరకు అందరినీ రక్షించామన్నారు. అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భద్రాచలంలో ఉన్నాయన్నారు. సతీష్ మరణం దురదృష్టకరమని, అతను రెండు సార్లు వెళ్లాడని, మూడవసారి అధికారులు వెళ్లొద్దని చెప్పిన వెళ్ళాడని, మీడియా మిత్రులు కూడా చాలా రిస్క్ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండాలని ఆదేశించారని, అందుచేత భద్రాచలంలో సుమారు 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు, కలెక్టర్ గౌతం, సీపీ విష్ణు వారియర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.