MP Nama: విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సినవి చేయలేదు
ABN , First Publish Date - 2023-08-10T14:33:41+05:30 IST
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని సభలో అన్ని వివరాలు చెప్పామని, తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలంగాణ (Telangana)కు అన్యాయం చేశారని సభలో అన్ని వివరాలు చెప్పామని, తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదని బీఆర్ఎస్ ఎంపీ (BRS MP) నామా నాగేశ్వరరావు (Nama Nageswararao) అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ (CM KCR) తాగు నీటికి.. సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ద్వారా నీరందించారన్నారు. కేంద్రం (Centra) తెలంగాణ పట్ల కక్షతో ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో అన్నీ విషయాలు ప్రస్తావించామన్నారు.
దీంతో తన మైక్ కట్ చేసి నిషికాంత్ దుబే (Nishikant Dubey)కు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అవకాశం ఇచ్చారని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రూ. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక, ఓర్వ లేక ఆ అభివృద్ధికి కేంద్రమే నిధులిచ్చిందని చెబుతున్నారన్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబేపై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతులు, క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో మొత్తం పూర్తి చేశామన్నారు. ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదని నామా వ్యాఖ్యానించారు.
సిడబ్ల్యుసీ డీపీఆర్ ప్రకారం రూ. 80 వేల కోట్లు.. కానీ రూ. 86 వేల కోట్లు ఇచ్చామని నిషికాంత్ దుబే అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టకు అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుందని, కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని చెప్పారు. కోటి రూపాయలు ఇచ్చినట్లు చూపితే తమ 9 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తామని నామా చెప్పారు. కేంద్రానికి దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. ఒక్క పైసా అయినా ఇచ్చినట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ అన్నారు. తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నది నచ్చక తప్పుడు మాటలు మాట్లాడారని నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.