Kirti Reddy: బీజేపీ నేత సంచలన కామెంట్స్... నోట్లకట్టలతో ఓట్లను కొనలేరు...
ABN , First Publish Date - 2023-08-12T12:37:44+05:30 IST
రాబోవు ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి నోట్లతో ఓట్లు కొనలేరని భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి
శాయంపేట(వరంగల్): రాబోవు ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి నోట్లతో ఓట్లు కొనలేరని భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తిరెడ్డి(Chandupatla Keerthi Reddy) అన్నారు. శుక్రవారం మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరా మర్శించారు. ఈ సందర్భంగా శాయంపేటలో కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూంలు నిర్మించడంలో పూర్తిగా విఫలమైందని, ఈ పథకం పేరున అనివీతి జరిగిందని మండిపడ్డారు. అవినీతి కప్పిపుచ్చుకోవడానికి మాటల గారడీ ప్రారంభించి గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టా రని ఎద్దేవా చేశారు. శాయంపేట మండల వ్యా ప్తంగా వచ్చిన 4 వేలపైన దరఖాస్తు దారులకు ఎంత గడు వులో పథ కం ద్వారా ఇళ్లు నిర్మిస్తారో గండ్ర దంపతులు స్పష్టత చేయా లని డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూత పథకం మాటలకే పరిమి తమైందని విమ ర్శిం చారు. గృహలక్ష్మి పథకం కార్యరూపం దాల్చకుంటే బీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. అనంతరం స్థానిక మహిళలు శాయంపేట(Sayampetada) నుండి ఆత్మకూరు వెళ్లే రోడ్డు నిర్మాణం మధ్యలోనే పనులు నిలిపి వేశారని కీర్తిరెడ్డికి విన్నవించారు. దీంతో గండ్ర దంపతుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని ఓట్లు వేసినందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయరాకుల మొగిలి, మండల నాయకులు నరహరిశెట్టి రామక్రిష్ణ, వనం దేవరాజు, బాసాని నవీన్, కోమటి శేఖర్, రాకేష్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.