Share News

KTR: గోషామహల్ BRS టికెట్‌పై వీడిన ఉత్కంఠ.. పాతబస్తీ అభ్యర్ధులకు బీఫామ్స్ అందజేత

ABN , First Publish Date - 2023-11-07T18:25:07+05:30 IST

పాతబస్తీ నియోజకవర్గాల అభ్యర్ధులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బీఫాంలు అందజేశారు.

KTR: గోషామహల్ BRS టికెట్‌పై వీడిన ఉత్కంఠ.. పాతబస్తీ అభ్యర్ధులకు బీఫామ్స్ అందజేత

హైదరాబాద్: పాతబస్తీ నియోజకవర్గాల అభ్యర్ధులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బీఫాంలు అందజేశారు.

యాకుత్ పుర - సామ సుందర్ రెడ్డి

కర్వార్ - అందెల క్రిష్ణయ్య

నాంపల్లి - ఆనంద్ గౌడ్.

చార్మినార్ - ఇబ్రహింలోడీ

చాంద్రాయన గుట్ట -సీతారాంరెడ్డి

మలక్ పేట - తీగల అజిత్ రెడ్డి

బహదూర్ పుర - అలీ బాక్రీకి బి ఫామ్ లు అందజేసినట్లు కేటీఆర్ తెలిపారు.

గోషామహల్ BRS టికెట్ పై ఉత్కంఠ వీడింది. BRS అభ్యర్థిగా నంద కుమార్ బిలాల్‌ను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ పడ్డ అశిస్ కుమార్ యాదవ్‌ను కేటీఆర్ బుజ్జగించారు. ఆశిష్ కుమార్ సమక్షంలో బిలాల్‌కు కేటీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఆశిష్ తో కలిసి పని చేయాలని బిలాల్‌కు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

మొత్తం 119 నియోజకవర్గాల అభ్యర్థులకు బిఫామ్ ల పంపిణీ పూర్తయింది. కేటీఆర్ సమక్షంలో గద్వాల కాంగ్రెస్ నేత కురువ విజయ్ బీఆర్ఎస్‌లో చేరారు. కురువ విజయ్‌కి కేటీఆర్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2023-11-07T18:27:26+05:30 IST