Challa Venkatrami Reddy: ఆ భూములతో హర్షవర్ధన్‌రెడ్డి‌కి సంబంధం లేదు

ABN , First Publish Date - 2023-09-26T16:25:26+05:30 IST

కోకాపేట భూముల(Kokapet lands) వ్యవహారానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి(MLA Harshavardhan Reddy)కి ఎలాంటి సంబంధం లేదు.. కానీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి(Challa Venkatrami Reddy) వ్యాఖ్యానించారు.

Challa Venkatrami Reddy: ఆ భూములతో హర్షవర్ధన్‌రెడ్డి‌కి సంబంధం లేదు

జోగులాంబ గద్వాల జిల్లా: కోకాపేట భూముల(Kokapet lands) వ్యవహారానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి(MLA Harshavardhan Reddy)కి ఎలాంటి సంబంధం లేదు.. కానీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి(Challa Venkatrami Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అలంపూరు జోగులాంబ బాలా బ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు. తెలంగాణ టూరిజంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గత నాలుగు రోజులుగా నా మీద ఆరోపణలు వచ్చాయి.. భూ కబ్జా చేశారని కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నా మీద మీడియాలో కథనాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అలంపూరు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. సర్వే నెంబర్ 85లోని 2 ఎకరాల-33 గుంటలు 2012 సంవత్సరంలో నేను స్వతహగ కొన్నా. నా సొంత భూమి.. నా పేరు మీద సేల్ డీడ్‌లో ఉన్నది. గోల్డ్ ఫిష్ సమస్తతో 2014లో డెవెలప్మెంట్ చేయడానికి నాతో అగ్రిమెంట్ చేసింది. గోల్డ్ ఫిష్ సంస్థ నిర్వాహకులు నేటి వరకు ఎలాంటి పని చేయలేదు. ఈ విషయంపై 2021లో నేను కోర్ట్‌కు వెళ్లాను. నా పక్క స్థలంలో కూలీలు గుడిసెలు వేశారు.. పోలీస్‌స్టేషన్లలో నా స్థలంలోకి వచ్చారని గోల్డ్ ఫిష్ సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. గోల్డ్ ఫిష్ సంస్థ డైరక్టర్ చంద్రశేఖర్ మీద 12 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు ఉన్నాయి.

2021 ఫిబ్రవరి 25వ తేదీన పీడీ యాక్ట్ అతనిపై నమోదైంది. మార్చి 24వ తేదీన 2021లో గోల్డ్ ఫిష్ సంస్థ డైరక్టర్ చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు వెళ్లాడు. హీరో ప్రభాస్ బంధువు సత్యనారాయణ, సంజయ్ కాంతం నేను మొదలైన వారు అదే కోకాపేటలో 4 ఎకరాలల్లో విల్లాస్ కట్టుకోవడానికి డబ్బులు కడితే కూడా పట్టించుకోలేదు. దీంతో ఈవిషయంపై కోర్ట్‌కెళ్లాం. స్థలాలు కొన్న వారిని చంద్రశేఖర్‌ బలి చేశాడు. కోకాపేటలోని సర్వేనెంబర్ 90లో 2018లో స్థలాన్ని డెవలప్‌మెంట్ చేయలేదని చంద్రశేఖర్‌పై కోర్ట్‌కు వెళ్లాం. గోల్డ్ ఫిష్ చైర్మన్ చంద్రశేఖర్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడమే అతని నైజం.. మీడియా పూర్తిగా తెలుసుకొని వాస్తవాలు తెలపాలి. 1998లో నేను రాజకీయం అరంగేట్రం చేశాను. నా 25 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి మచ్చ లేదు’’ అని చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T16:25:39+05:30 IST