CPM: చంద్రబాబు అరెస్ట్‌పై బీవీ రాఘవులు ఏమన్నారంటే?...
ABN , First Publish Date - 2023-09-11T13:54:20+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పందించారు.
సంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (Chandrababu Arrest) సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (CPM Leader BV raghavulu) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే చంద్రబాబునైనా (TDP Chief Chandrababu naidu), జగన్ నైనా (CM Jagan) అరెస్ట్ చేయాల్సిందే అని అన్నారు. కానీ చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు మాత్రం బాగాలేదన్నారరు. అర్ధరాత్రి, వేల మంది పోలీసులతో ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా అరెస్ట్ చేసిన తీరు సరి కాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టి, సాక్షాధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. కానీ ఇదేదో కావాలనే సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఉందని తెలిపారు. ఈ కేసు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది కానీ అకస్మాత్తుగా ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతో చేసినట్టు ఉందని బీవీ రాఘవులు వ్యాఖ్యలు చేశారు.