Harish Rao: రాష్ట్రంలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది

ABN , First Publish Date - 2023-10-09T12:42:24+05:30 IST

సిద్దిపేట జిల్లా: అర్బన్ మండలం, మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు.

Harish Rao: రాష్ట్రంలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది

సిద్దిపేట జిల్లా: అర్బన్ మండలం, మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ముఖ్య అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతుందని, గతంలో ఎరువు బస్తా కోసం చెప్పులను క్యు లైన్‌లో పెట్టేవారని.. ఇప్పుడాపరిస్థితి లేదని అన్నారు. గతంలో మనం కూలికి వెళ్ళేవాళ్ళమని, ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కులీ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, కొందరు నాలుకకు నరం లేదనీ ఇష్టం వచినట్టు మాట్లాడుతారని అన్నారు. పొరపాటున కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్టేనని, వీవోఏలను అదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఉద్యోగస్తులకు పీఆర్సీ కల్పించామన్నారు.

బీజేపీ గ్యాస్ ధరను అడ్డగోలుగా పెంచిందని, దాన్ని తగ్గించే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని, ఏ పథకం అయినా మహిళ పేరిట పెడితే సద్వినియోగం అవుతుందనీ కేసీఆర్ మహిళల పేరిట పథకాలు తెచ్చారని హరీష్ రావు కొనియాడారు. వయో వృద్ధులను ఈ వృద్ధాశ్రమంలో కన్న తల్లిదండ్రులవలే చూసుకుంటామన్నారు. క్షణికావేశంలో మహిళలు ప్రాణప్రాయ నిర్ణయాలు తీసుకోవద్దని.. భరోసా, సఖి సెంటర్‌లు ఏర్పాటు చేశామన్నారు. 120 మంది ఉండేలా మహిళా వర్కింగ్ ఉమెన్స్ హస్టల్ నిర్మించామని, బాల రక్ష భవన్‌లో 6 ఏళ్ల నుంచి 18 ఏళ్ల ఆడపిల్లలకు రక్షణ ఇస్తారని, తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు శిశుగృహ కేంద్రంలో రక్షణ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-09T12:42:24+05:30 IST