Congress.. సంగారెడ్డి జిల్లా: ఆసక్తికరంగా పటాన్‌చెరు రాజకీయం..
ABN , First Publish Date - 2023-11-10T07:40:15+05:30 IST
సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇటీవలే నీలం మధు పార్టీలో చేరారు. మొదట నీలం మధుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించింది.
సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. పటాన్‌చెరు కాంగ్రెస్ (Congress) టికెట్ ఆశించి ఇటీవలే నీలం మధు (Neelam Madhu) పార్టీలో చేరారు. మొదట నీలం మధుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఒత్తిడితో చివరి క్షణంలో కాటా శ్రీనివాస్ (Kata Srinivas)కు టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై నీలం మధు వర్గం అసహనం వ్యక్తం చేస్తూ.. సోనియా (Sonia), రాహుల్ గాంధీ (Sonia Gandhi)ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా పోటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ నీలం మధు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. శుక్రవారం పోటా పోటీగా కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు నామినేషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో పటాన్‌చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.