Harish Rao: మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం..

ABN , First Publish Date - 2023-04-25T15:09:36+05:30 IST

సిద్దిపేట: మనమంతా ఈ రోజు గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం.. సీఎం కేసీఆర్ (CM KCR) పడ్డ శ్రమ అని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.

Harish Rao: మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం..

సిద్దిపేట: మనమంతా ఈ రోజు గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం.. సీఎం కేసీఆర్ (CM KCR) పడ్డ శ్రమ అని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. మంగళవారం, సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్ వద్ద బీఆర్ఎస్ (BRS) నియోజకవర్గ స్థాయి ప్లినరీ, చిన్నకోడూర్ మండల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆకుపచ్చ చరిత్ర రాశారని.. దీనికి ప్రధానం కాళేశ్వరమని అన్నారు. హిస్టరీలు క్రియేట్ చేయడం ముఖ్యమంత్రికి కొత్తకాదన్నారు. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్ర మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశారని, బీఆర్‌ఎస్ ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోందన్నారు.

57 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వరి సాగు.. దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే వరి సాగు అవుతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదని, ఆనాడు మనుషులకే కాదు మూగ జీవాలకు సైతం గ్రాసం లేని దుస్థితి అని.. ఇప్పుడు పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతి ఢిల్లీలో మెచ్చుకుంటారని.. ఇక్కడ తిడతారని అన్నారు. ప్రధాని మోదీ తప్పులను ఎత్తి చూపితే తిడతారా? అని ప్రశ్నించారు. ఆడగడ్డా, అడిగితే ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పుతారని, దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ద్వారా తెలంగాణ ఖ్యాతి, గౌరవం పెరుగుతోందని హరీష్ రావు కొనియాడారు.

కేసీఆర్‌ను తిడితే తాము పెద్దవాల్లమైపోతామనుకుంటే పొరపాటని.. ప్రజల్లో మరింత పలుచన అవుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం వల్లనే అట్టడుగున ఉన్న తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. నిజాలను ఖచ్చితంగా మాట్లాడాలని, ప్రచారం చేయాలని, లేదంటే అబద్ధాలు రాజ్యం ఎలుతాయని అంబేద్కర్ చెప్పారన్నారు. ఒకప్పుడు ఎన్నికల నినాదాలు నేడు కళ్ళ ముందు నిజాలుగా మారాయని.. సమాధులు తవ్వాలని ఒక్కరు.. భవనాలు కూలగొడతామని ఇంకొకరు అంటున్నారని.. కూల గొట్టే వాళ్ళు కావాలో?... లేక ప్రగతి పునాదులు వేసే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు.

Updated Date - 2023-04-25T15:09:36+05:30 IST