Siddepet : మొన్న పెళ్లి.. నేడు రిసెప్షన్.. ఇంతలోనే నవ వరుడు మృతి..
ABN , First Publish Date - 2023-09-04T15:33:40+05:30 IST
పెళ్లి చేసుకునే వధూవరుల ఆనందం అంతా ఇంతా కాదు. పెళ్లై తమ జీవితభాగ్యమితో కలిసి ఎంతో సంతోషంగా గడపాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.
సిద్దిపేట జిల్లా: పెళ్లి చేసుకునే వధూవరుల ఆనందం అంతా ఇంతా కాదు. పెళ్లై తమ జీవితభాగ్యమితో కలిసి ఎంతో సంతోషంగా గడపాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అదే విధంగా ఆ వరుడు కూడా ఆశపడ్డాడు. అనుకున్న విధంగా పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ తరువాత రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా అంతలోనే పెను విషాదం ఆ ఇంటిని చుట్టుముట్టింది. పెళ్లై 24 గంటలు గడిచిందో లేదో నవవరుడిని మృత్యువు కబలించింది. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.
అసలేం జరిగింది..?
సిద్దిపేట జిల్లాలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న నిరంజన్ ఈరోజు ఉదయం కరెంటు షాక్‌తో మృతి చెందాడు. నిరంజన్‌ను శనివారం వివాహం జరిగింది. ఈరోజు రిసెప్షన్‌కు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతలోనే విద్యుత్ షాక్‌తో నిరంజన్ మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసందంలో మునిగిపోయారు. మృతుడు నిరంజన్ స్వస్థలం సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.