Parthasarathy: ఆయిల్ ఫార్మ్ సాగుతో దేశంలోనే తెలంగాణ అగ్రగ్రామిగా ఉంటుంది

ABN , First Publish Date - 2023-09-28T16:30:53+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫార్మ్ సాగు(Cultivation of oil farm)పై ఒక కమిషన్‌ను నియమించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి పార్థసారథి (Parthasarathy) వ్యాఖ్యానించారు.

Parthasarathy: ఆయిల్ ఫార్మ్ సాగుతో దేశంలోనే తెలంగాణ అగ్రగ్రామిగా ఉంటుంది

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫార్మ్ సాగు(Cultivation of oil farm)పై ఒక కమిషన్‌ను నియమించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి పార్థసారథి(Parthasarathy) వ్యాఖ్యానించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకుని గురువారం నాడు సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన ఆయిల్ ఫార్మ్ అవగాహన సదస్సులో హార్టికల్చర్ డైరెక్టర్ ఏం. హనుమంతరావు, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ...‘‘ఆయిల్ ఫార్మ్ సాగుకు తెలంగాణ రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో ఆయిల్ ఫార్మింగ్ సాగు నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నాయి. ఆయిల్ ఫార్మింగ్ వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఆయిల్ ఫార్మింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది’’ అని పార్థసారథి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T22:21:56+05:30 IST