Share News

Resign: బీఆర్‌ఎస్‌కు పఠాన్‌చెరు నేత మధు రాజీనామా..

ABN , First Publish Date - 2023-10-16T11:08:11+05:30 IST

బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Resign: బీఆర్‌ఎస్‌కు పఠాన్‌చెరు నేత మధు రాజీనామా..

సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ పార్టీకి (BRS) మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ (BRS leader Neelam Madhu Mudiraj) బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (BRS Chief KCR) రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిన్న (ఆదివారం) బీఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.


మీ బిడ్డనై వస్తున్నా.. ఆశీర్వదించండి...

రాజీనామా అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ.. పటాన్‌చెరులో అహంకారం కావాలో.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ‘‘ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా.. మీ బిడ్డనై వస్తున్నా. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. మీ బిడ్డనై వస్తున్న బీసీ బిడ్డను ఆశీర్వదించండి. పటాన్‌చెరు నియోజకవర్గం ఏ ఒక్క కులం దో కాదు. దోచుకొని... దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం. కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలి. మహిపాల్ రెడ్డి నీ అక్రమాల చిట్టా అంతా నా దగ్గర ఉంది. ఎమ్మెల్యే నన్ను, నా కార్యకర్తలను తొక్కేయేలాని చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం పటాన్‌చెరు వైపు చూస్తోంది... నిర్ణయం ప్రజలదే’’ అని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు.

neelam-madhu1.jpg


neelam-madhu2.jpg

Updated Date - 2023-10-16T11:36:52+05:30 IST