Sangareddy: పటాన్‌చెరులో పోలీసుల ఓవరాక్షన్

ABN , First Publish Date - 2023-06-22T16:21:21+05:30 IST

సంగారెడ్డి: పటాన్‌చెరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వస్తున్నారంటూ గంటలతరబడి ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. పాపాను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఎంత బ్రతిమాలినా పోలీసులు కరుణించలేదు.

Sangareddy: పటాన్‌చెరులో పోలీసుల ఓవరాక్షన్

సంగారెడ్డి: పటాన్‌చెరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ (CM KCR) వస్తున్నారంటూ గంటలతరబడి ట్రాఫిక్ (Traffic) నిలిపివేశారు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. పాపాను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఎంత బ్రతిమాలినా పోలీసులు కరుణించలేదు. ఆ సమయంలో కేసీఆర్ కొండకల్ కార్యక్రమంలో ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS) మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రాష్టం ఏర్పడ్డప్పుడు ఎన్నో అపోహలు సృష్టించారని అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే ఏకైక రాష్టం తెలంగాణ అని అన్నారు. పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ అత్యదిక ట్రాఫిక్ ఉండే ప్రాంతమని.. మళ్ళీ గెలిస్తే పటాన్ చెరు వరకు మెట్రో ఇస్తామని చెప్పారు. ఒకప్పుడు అక్కడ ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కునొక్కోవచ్చని చంద్రబాబు చెప్పారని.. కానీ ఇప్పుడు పరిస్థితి తారు మారు అయ్యిందని ఆయనే అన్నారని తెలిపారు. ఆ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు.

Updated Date - 2023-06-22T16:21:21+05:30 IST