Minister Puvvada: తన అభిమాన హీరో ఎవరో చెప్పేసిన మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2023-08-23T12:17:14+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Minister Puvwada Ajay Kumar) అన్నారు.

Minister Puvvada: తన అభిమాన హీరో ఎవరో చెప్పేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం: మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Minister Puvwada Ajay Kumar) అన్నారు. మంగళవారం చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమాన సంఘం నాయకులు రుద్రగాని ఉపేందర్‌, వీరేష్‌ గౌడ్‌, అంకతి మహేం దర్‌, జీవై నరేష్‌ ఆధ్వర్యంలో నగర వర్తక సంఘంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో మేయర్‌ పునుకొళ్ల నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, ఉపేందర్‌ గౌడ్‌, పసుమర్తి రామ్మోహన్‌, తోట వీరభద్రం, తోట రామారావు, గుండాల కృష్ణ, దేవరగట్ల ఈశ్వర వర్మ, బండి నవీన్‌, నాయకులు సాధిక్‌పాష, పాపారావు, పి. వెంకటేశ్వర్లు, పి.నాగరాజు, సంపత్‌, పాషా, సర్ధార్‌, శ్యామ్‌, సురేందర్‌, మద్దెల బాను, సప్తగిరి పాల్గొన్నారు.

aaaa.jpg

Updated Date - 2023-08-23T12:17:14+05:30 IST