Delhi Liquor Scam : రెండు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ..
ABN , First Publish Date - 2023-03-11T13:10:34+05:30 IST
రెండు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ : రెండు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో ఈడీ కవితను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్ మెంట్‌ను రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం ఆధారంగానే విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం.
తొలుత కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. అయితే వారిద్దరితో కలిపి కవితను ప్రశ్నించే అవకాశముందని తొలుత ఈడీ వర్గాలు చెప్పినప్పటికీ ప్రస్తుతమైతే కవిత విడిగానే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న క్రమంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా మందిని ఈ కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది