Kavitha ED enquiry: ఇంకా బయటకు రాని ఎమ్మెల్సీ కవిత.. ఈడీ ఆఫీస్ వెలుపల హైటెన్షన్ !

ABN , First Publish Date - 2023-03-20T21:02:08+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది.

Kavitha ED enquiry: ఇంకా బయటకు రాని ఎమ్మెల్సీ కవిత.. ఈడీ ఆఫీస్ వెలుపల హైటెన్షన్ !

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత రాత్రి 9 గంటలైనా బయటకు రాలేదు. మొదటి రోజు విచారణ సమయంలో రాత్రి 8 గంటలకే కవితను బయటకు పంపించిన ఈడీ అధికారులు ఈసారి ఇంకా ఎక్కువసేపు విచారిస్తున్నారు. దీంతో ఈ కార్యాలయంలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ చేస్తారా లేక మరోసారి విచారణకు పిలుస్తారా అనే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈడీ ఆఫీసు వెలుపల బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భద్రత బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఇందులో ఒక పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ఉంది.

ఉదయం నుంచి అసలేం జరిగింది..!?

సోమవారం ఉదయం 10.30 గంటలకే ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొదటి అరగంటపాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక సరిగ్గా 11 గంటలకు ఈడీ అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల తర్వాత కూడా కవిత బయటికి రాలేదు. సాయంత్రం సమయంలో తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. న్యాయవాదులు వెళ్లిన అరగంట వ్యవధిలోనే ఇద్దరు వైద్యులు కూడా ఈడీ ఆఫీసులోనికి వెళ్లారు. వైద్యులు ఎందుకెళ్లారు..? ఎవరికోసం వెళ్లారు..? అనే దానిపై క్లారిటీ రాలేదు.

Updated Date - 2023-03-20T21:10:25+05:30 IST