BRS vs BJP: 8న హైదరాబాద్‌కు మోదీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపు
ABN , First Publish Date - 2023-04-06T17:44:17+05:30 IST
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నువ్వొకటంటే.. నే రెండంట అన్న తరహాలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సమరం సాగుతోంది.
హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నువ్వొకటంటే.. నే రెండంట అన్న తరహాలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సమరం సాగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ నేతల విమర్శలు ఆరోపణలతో తెలంగాణ (Telangana) అట్టుడికిపోతోంది. ఈ నెల 8న హైదరాబాద్ (Hyderabad)కు ప్రధాని మోదీ వస్తున్నారు. అదే రోజు తెలంగాణ వ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ప్రధాని కార్యక్రమంలో నిరసన తెలపాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, విభజన హామీల అమలు పెండింగ్‌లపై నిరసనకు తెలపాలని గులాబీ పార్టీ బాస్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
8న హైదరాబాద్‌కు మోదీ
ఈ నెల 8న హైదరాబాద్‌కు(Hyderabad) ప్రధాని మోదీ(Prime Minister Modi) రానున్నారు. శనివారం ఉదయం 11.30గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు(Begumpet Airport) వచ్చిన తర్వాత ప్రధాని 11.35 గంటలకు బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు(Secunderabad Railway Station) చేరుకోనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైల్(Secunderabad-Tirupati Vande Bharat Rail) ప్రారంభించనున్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్(Chief Minister KCR) వస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌కు(KCR) ఆహ్వానం పంపినట్లు తెలిపారు. తెలంగాణలో మోదీ (Modi) పర్యటించినప్పుడల్లా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మోదీ పర్యటనలో ప్రతిసారి సీఎం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్
ప్రధానమంత్రికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ (BJP) తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ రగడ(Rub the protocol) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల ప్రధాని పర్యటలో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ కు కొద్దీ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌కు భారత ప్రధాని పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడానికి 7నిమిషాల పాటు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. 12.30గంల నుంచి 12.37నిమిషాల వరకు సీఎం కేసీఆర్‌కు ప్రసంగానికి టైమ్ కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి మోదీ పర్యటనకు సీఎం హాజరవుతారా చివరకు ఏదైనా కారణం చెప్పి డ్రాప్ అవుతారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.