Uttam Kumar Reddy: కేంద్రమంత్రితో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ.. ఏం మాట్లాడారంటే...

ABN , First Publish Date - 2023-04-06T17:07:20+05:30 IST

కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ (Union Minister Ashwin Vaishnav)తో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy) సమావేశమయ్యారు.

Uttam Kumar Reddy: కేంద్రమంత్రితో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ.. ఏం మాట్లాడారంటే...

ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ (Union Minister Ashwin Vaishnav)తో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy) సమావేశమయ్యారు. నల్గొండ జిల్లాలో రైల్వే ప్రాజెక్టులను ఆధునీకరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో రవాణా, రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచాలని, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైలు మార్గం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. జగ్గయ్యపేట, మెళ్లచెరువు, జానపాడు, వాడపల్లి, విష్ణుపురం మధ్య 90 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం త్వరగా ప్రారంభించాలని కోరినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ప్యాసింజర్ ట్రావెల్, సర్వీసులను ఇదే మార్గంలో ప్రారంభించాలని కోరానని, సిమెంట్ ఫ్యాక్టరీలను ఈ లైన్ కలుపుతుందని తెలిపానని, ఈ ప్రాంతాల్లో డబ్లింగ్ లైన్ చేపట్టాలని కోరినట్లు ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.

వందేభారత్ రైళ్లు నల్గొండ స్టేషన్లో ఆపేలా చర్యలు చేపట్టాలని కోరానని, ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారని, అందుకు తగిన చర్యలు చేపడతామన్నారని ఉత్తమ్ వెల్లడించారు. మిర్యాలగూడ స్టేషన్లో అపే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని, వందేభారత్ రెండో ఎక్స్ప్రెస్ రైలు త్వరలో ప్రారంభం కానుందని ఎంపీ స్పష్టం చేశారు. నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైలును నల్గొండ, మిర్యాలగూడలో ఆపేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-06T17:09:59+05:30 IST