Home » Uttam Kumar Reddy Nalamada- Congress
ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
లంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన చెరువులు అన్ని పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ రావు లేఖరాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.