ACB Raids: మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. కిలోల కొద్దీ బంగారం
ABN , First Publish Date - 2023-09-30T14:14:59+05:30 IST
మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
నల్గొండ: మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి (Marriguda Tehsildar Manchireddy Mahender Reddy) ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, భారీగా బంగారం బయటపడింది. తహసీల్దార్ నివాసంలో కట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లుకు పైగా నగదు లభ్యమైంది. అలాగే కిలోల కొద్దీ బంగారం ఏసీబీ అధికారులు దాడుల్లో బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని మహేందర్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. మహేందర్ రెడ్డికి సంబందించిన 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మహేందర్ రెడ్డి ఇటీవలే కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి బదిలీపై వచ్చారు. తహసీల్దార్ మహేందర్ రెడ్డి స్వస్థలం ఇబ్రహీంపట్నం. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.