Bhuvanagiri: రైతులకు బేడీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు

ABN , First Publish Date - 2023-06-13T16:42:32+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా: రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Bhuvanagiri: రైతులకు బేడీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: రైతులకు సంకెళ్లు (Farmers are Shackled) వేసి కోర్టు (Court)లో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మే 30న భువనగిరి కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన (Protest) చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు (Non-Bailable Cases) నమోదు చేసిన భువనగిరి రూరల్ పోలీసులు.. అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అందులో భాగంగా రైతులకు బేడీలు వేసి భవనగిరి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

గత కొద్ది రోజులుగా రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే మే 30న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన క్రమంలో పోలీసులు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మంగళవారం వారికి సంకేళ్లు వేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.

అయితే రైతులకు బేడీలు వేయడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు తీసుకోకుండా రైతుల భూములను గుంజుకుంటున్నారు. దీనిపై రైతులు శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రాయగిరి రైతులకు బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. రైతుల కోసమే చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. రైతులపై కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-13T16:42:32+05:30 IST