Share News

Yadadri: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2023-10-28T08:27:06+05:30 IST

యాదాద్రి: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు.

Yadadri: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత

యాదాద్రి: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. తిరిగి రేపు వేకువజామున ఆలయాన్ని తెరిచి ఆలయ పండితులు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు.

ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడ మూసివేయనున్నారు. అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవిస్తుందని, శనివారం అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు గ్రహణం ఉంటుంది. కాగా శుక్రవారం రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలు బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో జరిగాయి.

Updated Date - 2023-10-28T08:27:06+05:30 IST