Kavitha: బీఆర్ఎస్ కుటుంబం పెద్దది.. కేసీఆర్ మనసు పెద్దది..
ABN , First Publish Date - 2023-06-07T14:36:40+05:30 IST
నిజామాబాద్: బీఆర్ఎస్ కుటుంబం పెద్దదని, సీఎం కేసీఆర్ మనసు పెద్దదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...
నిజామాబాద్: బీఆర్ఎస్ (BRS) కుటుంబం పెద్దదని, సీఎం కేసీఆర్ (CM KCR) మనసు పెద్దదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. బుధవారం నిజామాబాద్ (Nizamabad)లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గులాబీ కండువా కప్పుకుంటే ప్రజలకు గులాంలాగా పని చేయాలని, గులాబీ కండువాపై నమ్మకం ఉండాలని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు చెబుతాయి.. కానీ నిజం ఉండదన్నారు.
జవాన్‌లు, కిసాన్‌లను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్‌దేని.. బీఆర్ఎస్ పార్టీ అంటే మహా సముద్రమని కవిత అన్నారు. గతంలో 23శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని, ఇప్పడు తెలంగాణలో 66 శాతం ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం ఏం కావాలలో ఎప్పుడూ సీఎం కేసీఆర్ ఆలోచిస్తునే ఉంటారని, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో అబద్ధాలు చెబుతున్నాయని, నిజాలు చెప్పాలన్నారు. నిజాలు చెబితే గౌరవిస్తామని, అబద్దాలు చెబితే ఊరుకోమని అన్నారు. ఎవరెస్టు శిఖరం లాంటి కేసీఆర్ ప్రజలకు అండగా ఉన్నారని, నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.