Raghunandan Rao: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2023-07-24T14:51:37+05:30 IST
ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
కామారెడ్డి: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubbaka MLA Raghunandan Rao) ప్రశ్నించారు. సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్లని పేద ప్రజలకు ఇవ్వాలని చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందర్‌రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి అన్యాయం చేసిందన్నారు. ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్‌కు (CM KCR) పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. దళితబంధు కామారెడ్డి జిల్లాలో ఎంత మందికి ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బూత్ స్థాయి బాధ్యులు గ్రామగ్రామాన కేసీఆర్ చేపట్టిన ఆరాచకాలను ప్రజలకు తెలపాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద గరీబోల్లకి కేంద్రం ఇండ్లు కట్టిచ్చిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లపై పోరాటం చేస్తామని అన్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి బీసీబంధు రాదని... కేవలం గులాబీ కండువా కప్పుకున్న వారికే వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. నాలుగేండ్ల నుంచి కామారెడ్డిలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆగస్టు 15 వరకు ఇండ్లు ఇవ్వకపోతే ప్రతీ గ్రామంలో ధర్నాలు చేయాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు.