Home » Raghunandanrao
బక్రీద్‌కు రెండు రోజుల ముందు మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్లు పోలీసుల వైఫల్యంతోనే అని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. ఈ అల్లర్లలో అరెస్టు అయిన బీజేపీ నేతల బెయిల్ పిటిషన్ ఈరోజు(గురువారం) దాఖలు చేశారు. వారి తరపున మెదక్ జిల్లా న్యాయస్థానంలో ఎంపీ, న్యాయవాది రఘునందన్ రావు వాదించారు.
బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్‌లో పట్టుబడ్డ కొందరు పోలీసులు జైల్లో ఉన్నారని .. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghundan Rao) హెచ్చరించారు.
మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావును మాజీమంత్రి హరీశ్‌రావు అభినందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. అయితే బుధవారం వారిద్దరు ఎదురుపడినప్పుడు భిన్న వాతావరణం కనిపించింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. రేపు జరిగే పట్టభద్రుల ఎన్నికలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలను, ఇన్చార్జిగా నియమించారని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు.
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao)పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు (Raghanandana Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కంటే తాను రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నానన్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్నారు. ఎంతమందికి ఆ సొమ్మును పంచారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? అని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చేర్చాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని...