Cyber Fraud: కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం
ABN , First Publish Date - 2023-09-13T21:46:43+05:30 IST
జిల్లాలో సైబర్ మోసం (Cyber fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు.
కామారెడ్డి: జిల్లాలో సైబర్ మోసం (Cyber fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు. బ్యాంకు అకౌంట్, యూపీఐ ఐడీ పంపాలంటూ అవతలి వ్యక్తి సూచించాడు. దీంతో ఆగంతకుడి మాటలు నమ్మి యూపీఐ, అకౌంట్ నెంబర్‌ను బాధితుడు సూర్ సింగ్ కేటుగాడికి పంపించాడు. కొద్దిసేపటికే బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి 40,000 డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. మోసపోయానని గ్రహించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.