KTR: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోంది
ABN , First Publish Date - 2023-08-14T16:10:15+05:30 IST
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోందని, నాడు కేసీఆర్ ఎత్తుకున్న మాటలో నిజాయితీ ఉందని.. అందుకే సమాజం అంతా వెన్నంటి వచ్చిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోందని, నాడు కేసీఆర్ (KCR) ఎత్తుకున్న మాటలో నిజాయితీ ఉందని.. అందుకే సమాజం అంతా వెన్నంటి వచ్చిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యానించారు. సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఎల్లారెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి రూ. 45 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎక్కువగా ఉన్న అయిదో ప్రాంతం ఎల్లారెడ్డి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ (Congress)లో ఉన్న దిక్కుమాలిన పాలన మళ్లీ కావాలా? అని మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం బీఆరఎస్ నేత సురేందర్ (BRS Leader Surendar)ను 70 వేల మెజారిటీతో గెలిపించాలని.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. షబ్బీర్ అలీ (Shabbir Ali) మంత్రిగా ఉండి సాధించలేని అభివృద్ధి గంప గోవర్ధన్ (Gampa Govardhan) చేశారన్నారు. గడప గడపకు కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని.. అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అంటున్నారని.. 50 ఏళ్లు పాలించి ఏం పీకారని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. తాము ఏం చేశామో నిరూపిస్తామన్నారు. రూ. 4 వందల సిలెండర్‌ను రూ. 12 వందలు చేసిన నరేంద్రమోదీ (Modi)కి బుద్ది చెప్పాలన్నారు. చేతకానోళ్లు, బెకార్ గాళ్ళకు మనతో పోటీయా? అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.