Talasani Srinivas: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం
ABN , First Publish Date - 2023-09-14T10:16:27+05:30 IST
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
కామారెడ్డి: సీఎం కేసీఆర్ (CM KCR) కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani srinivas Yadav) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు. మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రజలకి ఇచ్చిన హామీలని అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చేతులేత్తేసే పరిస్థితిలో ఉందన్నారు. డిక్లరేషన్‌లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగుతున్నారన్నారు. 65 సంవత్సరాల ప్రజల గోసని తోమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ తీర్చారని తెలిపారు. కామారెడ్డి రూపు రేఖలు రెండు, మూడు నెలల్లో పూర్తిగా మారిపోనున్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు ఊహకందని మెజారిటిని కేసీఆర్‌కు ఇవ్వాలని కోరారు. ఏ ఒక్క ప్రాజెక్టు కేంద్రం నుంచి తీసుకురాకుండా లేనిపోని మాటలతో ప్రజలను బీజేపీ నాయకులు మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.