Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన
ABN , First Publish Date - 2023-10-28T12:56:10+05:30 IST
ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కామారెడ్డి: ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి (Congress Leader Subhash Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి పాల్గొనగా.. ఆయనను చూసి కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులను నమ్ముకుంటే నట్టేట ముంచారని సుభాష్ రెడ్డి రోధించారు. ప్రతినిత్యం నియోజకవర్గంలో తన సొంత పనులను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాపాడుకున్నా, చంపుకున్నా మీదే బాధ్యత అంటూ కార్యకర్తలతో తన ఆవేదనను వెలిబుచ్చారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం సుభాష్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.