Maoist: ఏజెన్సీలో పోలీసుల హైఅలెర్ట్.. ఆందోళనలో ఏజెన్సీ గ్రామాలు
ABN , First Publish Date - 2023-05-02T12:14:31+05:30 IST
ఏజెన్సీ (Agency)లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు తెగబడ్డారు. రెండేళ్లుగా చప్పుడు చేయని నక్సల్స్..
ములుగు: ఏజెన్సీ (Agency)లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు తెగబడ్డారు. రెండేళ్లుగా చప్పుడు చేయని నక్సల్స్.. ఒక్కసారిగా చెలరేగిపోయారు. రెప్పపాటులో విరుచుకుపడి రక్తపాతం సృష్టించారు. 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్‌జీ (డిస్ర్టిక్ట్ రిజర్వ్‌డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును హతమార్చారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అందువల్ల తెలంగాణ (Telangana) సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరపడే అవకాశం ఉందనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ ఉన్నతాకారుల సమీక్ష నిర్వహించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ ప్రభాకరన్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో సమావేశమయ్యారు. వెంకటాపురంలో భారీగా సీఆర్పీఎఫ్ బలగాల మోహరించారు. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు మోహరించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (Chhattisgarh Maharashtra) సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీ నిఘా పెట్టారు. నిరంతరం డ్రోన్ నిఘాతో పాటు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారనే టాక్ ఉంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే నిఘా వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. ములుగు, కొత్తగూడెం జిల్లాల (Mulugu Kothagudem districts)కు వీరాపూర్ సరిహద్దుగా ఉండటంతో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశాన్ని నిర్వహించినట్టు పోలీసు ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు భావిస్తున్నాయి. అయితే మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా.. లేక ఈ సమావేశంలో దామోదర్ కూడా పాల్గొన్నారా? అనే కోణంలో కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇక మావోయిస్టులకు గొత్తికోయల నుంచి మద్దతు లభిస్తుందనే అనుమానంతో పోలీసులు గొత్తికోయగూడేల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడవుల మధ్య గూడేలను ఖాళీ చేసి, జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బలమైన కేడర్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ జిల్లాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు దశాబ్దకాలంగా మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు తిప్పికొడుతున్నా రు. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో మావోయి స్టుల ఏరివేతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆపరేషన్ ప్రహార్ పేరుతో కేంద్ర బలగాలతో అడవు లను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. దీంతో దండకారణ్యంలోని చెట్ల ఆకు లు రాలిపోయి, అడవి పలుచ పడుతోంది. దీంతో అడ వుల్లో నక్సల్స్ షెల్టర్లను, కదిలికలను గుర్తించటం పోలీ సులకు సులభంగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో మావో యిస్టుల కదిలికలపై నిఘా పెట్టిన పోలీసుల కు, ఆకురాలే కాలం మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ మధ్య కాలంలో తమకు పట్టున్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.