Rains lash Hyderabad : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో..
ABN , First Publish Date - 2023-07-25T20:29:55+05:30 IST
తెలంగాణను ఇప్పట్లో భారీ వర్షాలు (Heavy Rains) వదిలే పరిస్థితులు కనిపించలేదు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు ఉదయం నుంచి కాస్త గ్యాప్ నుంచి వర్షం సాయంత్రం అయ్యేసరికి మరోసారి భారీగానే కురిసింది. అయితే ఇక వర్షలు రానట్లేనని//
తెలంగాణను ఇప్పట్లో భారీ వర్షాలు (Heavy Rains) వదిలే పరిస్థితులు కనిపించలేదు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం సాయంత్రం అయ్యేసరికి మరోసారి భారీగానే కురిసింది. అయితే ఇక వర్షలు రానట్లేనని హైదరాబాదీలు (Hyderabadies) అనుకునేలోపే వాతావరణ శాఖ బాంబ్ లాంటి వార్త వెల్లడించింది. హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ (Hyderabad), మేడ్చల్ (Medchal), రంగారెడ్డి (Rangareddy)జిల్లాల్లో భారీగా వానలు పడతాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగర ప్రజలంతా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
ఇవాళ రాత్రికి ఇలా..
మరోవైపు.. భాగ్యనగరంలో ఇవాళ రాత్రి భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటలకే నగరంలో వర్షం మొదలైంది. అయితే రెండు గంటల పాటు భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్ సిటీకి ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతున్నది. కాగా.. నిన్న కురిసిన వర్షాలతో సిటీలో అత్యధికంగా షేక్ పేట్‌లో-09, ఖైరతాబాద్‌లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రికి అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ సూచించారు.
సెలవులు లేవు..
మరోవైపు.. హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు వర్షాలున్న నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కీలక ఆదేశాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు. ఈ వానలు ఉన్నన్ని రోజులు అధికారులు, సిబ్బందికి సెలవుల్లేవని.. అత్యవసరమైతేనే తప్ప సెలవులు ఇవ్వొద్దని ఉన్నతాధికారులను మేయర్ ఆదేశించారు. కాగా.. గతవారంలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చినప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం ఇవ్వలేదు. అయితే అత్యవసరం అయితే కచ్చితంగా సెలవులు ఉంటాయని మేయర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టిసారించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఎలాంటి అత్యవసరం ఉన్నా 040-21111111, 90003111367 నంబర్లకు ఫోన్ చేయాలని మేయర్ సూచించారు.
తెలంగాణలో ఇలా..
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా 8 జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, యాదాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మంగళ, బుధవారాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. మరోవైపు.. అప్రమత్తమైన డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.