Telangana Rains Live Updates: కాజీపేట్ రైల్వే స్టేషన్‌ ఎలా ఉందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-27T08:43:58+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు (Telugu States) దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి వరంగల్ (Warangal) .. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) వైజాగ్ (Vizag) జిల్లాల్లో గ్యాప్ లేకుండా వానలు కుమ్మేస్తున్నాయి.!..

Telangana Rains Live Updates: కాజీపేట్ రైల్వే స్టేషన్‌ ఎలా ఉందో చూడండి..

Live News & Update

  • 2023-07-27T13:35:00+05:30

    heavy-rains-telangana.jpg

    * డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు

    * తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్న డీజీపీ అంజనీ కుమార్

  • 2023-07-27T13:30:00+05:30

    * భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2&7 తాత్కాలికంగా మూసివేత

    * పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతలమయంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)

    * భారీ వాహనాలు వెళ్లే 3,4 లేన్లలో అడుగడుగునా గుంతలు

    * దీంతో ఆ వాహనాలు కార్లు వెళ్లే 1, 2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలు

  • 2023-07-27T13:10:00+05:30

    • తెలంగాణను బెంబేలెత్తిస్తున్న భారీ వర్షాలు

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

    • కాజీపేట రైల్వే స్టేషన్‌లో మునిగిపోయిన రైలు పట్టాలు

    • రైల్వే స్టేషన్‌లోకీ చేరిన వరద నీరు

    • పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం

      Warangal.jpg

  • 2023-07-27T12:50:00+05:30

    Rains.jpg

    • తెలంగాణకు మరో 48 గంటలు భారీ వర్ష సూచన

    • విద్యా సంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

  • 2023-07-27T11:15:00+05:30

    6201691c-e78f-4b20-8d67-4feda3833b1b.jpg

    * తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షం

    * గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిమీ (64 సె.మీ) వర్షం

    * గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షం

    * 200ల కేంద్రాల్లో 10 సెం.మీ పైగా వర్షం

  • 2023-07-27T11:10:00+05:30

    భయం గుప్పిట్లో భాగ్యనగరం.. గ్రేటర్‌లో హైఅలర్ట్

    కుండపోతగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో నాన్ స్టాప్‌గా వర్షం పడుతోంది. అలాగే బోయినపల్లి, సనత్ నగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. సహాయక చర్యల కోసం డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111, 9000113667 ఏర్పాటు చేసింది. ఇప్పటికే విద్యా సంస్థలకు తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది. గ్రేటర్‌లో అత్యధికంగా బండ్లగూడలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కాప్రాలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం, చర్లపల్లిలో 5.2 సెంటీమీటర్లు, గోల్కొండలో 5.1 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లిలో 5 సెంటీమీటర్లు, మియాపూర్‌లో 5 సెంటీమీటర్లు, చంద్రాయణగుట్టలో 4.9 సెంటీమీటర్లు, కండికల్ గేట్‌లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

  • 2023-07-27T11:00:00+05:30

    * ఖతార్ ఎయిర్ లైన్స్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. నేడు వాతావరణం అనుకూలించక పోవడంతో ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పైలెట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానం దోహా నుంచి నాగపూర్ వెళుతోంది. ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.

    qtar.jpg

  • 2023-07-27T09:55:00+05:30

    kcr-speed.jpg

    * భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

    * మోరంచపల్లిలో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా

    * మంత్రి ఎర్రబెల్లితో మాట్లాడిన సీఎం కేసీఆర్

    * మోరంచపల్లిలో సహాయకచర్యలు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశం

    * గోదావరి పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేయాలని ఆదేశం

  • 2023-07-27T09:45:00+05:30

    2bdc8adb-e7fd-4181-912e-793d01aaba8f.jpg

    * భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద బీభత్సం

    * మోరంచవాగు పొంగడంతో గ్రామాన్ని ముంచెత్తిన వరద

    * మోరంచపల్లిలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతు

    * గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ఇళ్లు, చెట్లు ఎక్కిన జనాలు

    * భవనాలపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న జనాలు

    * రక్షించాలంటూ మోరంచపల్లి గ్రామస్తుల ఆర్తనాదాలు

    errabelli.jpg

    * మోరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి ఎర్రబెల్లి

    * మోరంచపల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపిస్తున్నాం

    * వరద బాధితులను ఆదుకుంటాం: ABNతో మంత్రి ఎర్రబెల్లి

  • 2023-07-27T09:30:00+05:30

    7da6e854-3ef2-4d88-982e-d168637b0771.jpg95ac5cb0-4561-4954-8576-ea624382b258.jpg

    * ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు

    * మున్నేరు వాగులో 26 అడుగులకు చేరిన వరద ప్రవాహం

    * మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

    * లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

  • 2023-07-27T08:55:00+05:30

    * ములుగు: వెంకటాపురం మండలం వీరభద్రవరం..

    అడవుల్లో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు సేఫ్

    * సురక్షితంగా బయటకు వచ్చేసిన పర్యాటకులు

    * ఊపిరి పీల్చుకున్న అధికారులు, బంధువులు

    * 8 గంటల ఉత్కంఠకు తెర

    * ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి..

    తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకున్న పర్యాటకులు

    * రంగంలోకి దిగిన NDRF బృందం, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు

    * వీరభద్రవరం రూట్ కాకుండా మరో మార్గంలో..

    * అంకన్నగూడెం చేరిన బాధితులు

    * రిసీవ్ చేసుకున్న కలెక్టర్ ఐలా త్రిపాఠీ, ఎస్పీ గౌస్ ఆలం

    * భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

    * 50 అడుగులు దాటి ప్రవాహం

    * 12,51,999 క్యూసెక్కుల నీటి ప్రవాహం

    * కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

    GuG5pv53FqDPa8Mv.jpg

    * రెడ్ అలెర్ట్ జోన్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా

    * భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

    * మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి

    * 50 అడుగులు దాటి గోదావరి ప్రవాహం

    * భద్రాచలం నుంచి చర్ల వైపు ఏపీ-ఒడిశా ప్రధానరహదారి..

    * కూనవరం వైపు పలుచోట్ల రహదారులపైకి పోటెత్తిన వరద నీరు

    * తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు

    * జిల్లా వ్యాప్తంగా నిండుకుండలా మారిన 1,035 చెరువులు

    * రంగంలోకి దిగిన రెండు NDRF బృందాలు

    * భద్రాచలం-కొత్తగూడెం రూట్‌లో పలుచోట్ల రహదారులపైకి వరద నీరు

    * అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు: కలెక్టర్‌

    Bhadrachalam_during_2005_fl.jpg

    * ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

    * రాత్రంతా కురిసిన జడివాన

    * ముంచెత్తుతున్న వరదలు

    * వరంగల్లో నీటమునిగిన ఇళ్లు

    * వరంగల్ నగరంలో జలదిగ్భందంలో 35 కాలనీలు

    * ములుగు జిల్లా పస్రా-గోవిందరావుపేటలో ఇళ్లలోకి వరద నీరు

    * ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన వాగులు, వంకలు

    * వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్

    * ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారుల హెచ్చరికలు

    650c088f-211b-4fb6-aae3-aed8e1c5796c.jpg

    * నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద

    * ఇన్ఫ్లో 3.87 లక్షలు, ఔట్‌ఫ్లో 2.19 లక్షల క్యూసెక్కులు

    * కడెం ప్రాజెక్ట్ దగ్గర 14 ఎత్తి నీరు దిగువకు విడుదల

    * కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు

    * కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 697.800 అడుగులు

    * భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్ట్కు పోటెత్తిన వరద

    * 25 గేట్లు ఎత్తి 1,27,717 క్యూసెక్కుల నీరు విడుదల

    f0773f3e-527e-4e07-87c7-18aa32080687.jpg

    * నిర్మల్: ప్రమాదపుటంచులో కడెం ప్రాజెక్టు

    * కెపాసిటీకి మించి ఎగువ నుంచి చేరుతున్న వరద

    * ప్రాజెక్టు సామర్థ్యం 3.5 లక్షల క్యూసెక్కులు కాగా..

    అంతకుమించి వచ్చి చేరుతున్న వరద ప్రవాహం

    * మొత్తం 18 గేట్లలో మోరాయిస్తున్న 4 వరద గేట్లు

    * 14 గేట్లను ఎత్తి 2.19 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

    * ఎడమ కాల్వ గుండా వెళ్లి పోతున్న వరద ప్రవాహం

    * ఆందోళనలో దిగువ ప్రాంతాల ప్రజలు

    * గతేడాది పరిస్థితి పునరావృతం అవుతుందని ఆందోళన

    * అలర్ట్ ప్రకటించిన అధికారులు

    Bhadrachalam_during_2005_fl.jpg

    * భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం

    * 50.20 అడుగులు దాటి వరద ప్రవాహం

    * 12,65,653 క్యూసెక్కుల ప్రవాహం

    * కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

    12a754c7-a653-491d-bfef-50508f798d18.jpg

    * జయశంకర్‌: మోర్చా వాగు ఉధృత ప్రవాహం, ఆందోళనలో స్థానికులు

    * భద్రాద్రి: కరకగూడెం మండలం బంగారుగూడెం శివారులో దుప్పితోగు వాగు ఉద్ధృత ప్రవాహం

    * ఆటోని దాటిస్తుండగా అదుపు తప్పి యువకుడు పాపారావు గల్లంతు, ఆచూకీ కోసం గాలింపు చర్యలు

    2bdc8adb-e7fd-4181-912e-793d01aaba8f.jpg

    * కరీంనగర్: అర్థరాత్రి నుంచి నగరంలో భారీ వర్షం

    * ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు

    * లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద

    * ప్రమాదకర రీతిలో మత్తడి దుంకుతున్న కొత్తపల్లి చెరువు

    * మిడ్ మానేరుకు భారీగా వరద

    d6a299cb-67ae-4d40-8e79-71b3d61245ae.jpg

    * నిర్మల్: కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద

    * ఇన్ఫ్లో 3.80 లక్షలు, ఔట్‌ఫ్లో 2.38 క్యూసెక్కుల నీరు

    * కడెం ప్రాజెక్ట్‌ దగ్గర 14 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

    * కడెం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు

    * కడెం ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 699.800 అడుగులు

    140bbca1-4872-4231-839c-a50ad46c2717.jpg

    * మంచిర్యాల: కుమురంభీమ్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద

    * ఇన్ఫ్లో 76 వేలు, ఔట్‌ఫ్లో 77 వేల క్యూసెక్కులు

    * 8 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

    * ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 241.50 మీటర్లు

    * కుమురంభీమ్‌ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటినిల్వ 237.700 మీటర్లు

    d4a66cba-4a91-4e88-a3e2-32e7fdbeb7ac.jpg

    * మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద

    * ఇన్ఫ్లో 1.53 లక్షలు, ఔట్‌ఫ్లో 1.67 లక్షల క్యూసెక్కులు

    * ప్రాజెక్ట్‌ దగ్గర 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

    * ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు

    * ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటినిల్వ 15.4788 టీఎంసీలు

    RAINS1.jpg

    * రాజమండ్రి: ధవళేశ్వరం దగ్గర ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

    * బ్యారేజ్ దగ్గర గంటగంటకూ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    * 11.75 అడుగులు దగ్గర కొనసాగుతున్న గోదావరి నీటిమట్టం

    * ప్రాజెక్ట్‌ దగ్గర 175 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

    * నిర్మల్: స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి వరద ప్రవాహం

    * ఇన్ఫ్లో, ఔట్‌ఫ్లో 13 వేల క్యూసెక్కుల నీరు

    * 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

    * స్వర్ణ ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 1,183 అడుగులు

    * స్వర్ణ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 1,181అడుగులు

    * జయశంకర్: మోరంచపల్లిలో వరద బీభత్సం

    * మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి చేరిన వరద నీరు

    * వరద ప్రవాహంలో ఐదుగురు గల్లంతు

    95ac5cb0-4561-4954-8576-ea624382b258.jpg7da6e854-3ef2-4d88-982e-d168637b0771.jpg

    * ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు

    * 26 అడుగులకు చేరుకున్న వరద ప్రవాహం

    * మున్నేరు పూర్తి నీటి సామర్ధ్యం 25 అడుగులు

    * భయాందోళన లో మున్నేరు ముంపు వాసులు

    * ముంపునకు గురయన మోతి నగర్ , బొక్కల గడ్డ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

    * ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు ,బుగ్గేరు

    * మండలంలో పలు గ్రామాలతో పాటు డోర్నకల్లు మండలానికి నిలిచిన రాకపోకలు

    * భయాందోళనలో మున్నేరు పరివాహక గ్రామాల ప్రజానీకం

    * మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్ భారీ వరద

    * రెండు గేట్లు ఎత్తివేత

    * ఇన్ ఫ్లో: 48,000 క్యూసెక్కులు

    * ఔట్ ఫ్లో: 55,856 క్యూసెక్కులు

    * పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు..

    * ప్రస్తుత నీటి నిల్వ 9.234 టీఎంసీలు

    * జూరాల ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 8 యూనిట్లలో 316 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

    * నిర్మల్: కడెం ప్రాజెక్టు ఉధృతి నేపథ్యంలో అధికారుల అలర్ట్,

    * లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు,

    * పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు,

    * పాండవపూర్ వంతెన వద్ద వరద ఉధృతి,

    * నిర్మల్ -మంచిర్యాల రూట్లలో రాకపోకలు నిలిపి వేత,

    * ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రేఖా నాయక్, అధికారులు,

    * ప్రకాశం బ్యారేజ్ వద్ద నిలకడగా కొనసాగుతున్న వరద ప్రవాహం

    * ప్రకాశం బ్యారేజీ 30 గేట్లు 2అడుగులు 40 గేట్లు అడుగు మేరకు ఎత్తి 72వేల క్యూసెక్కుల నీరు విడుదల

    * ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు 12 అడుగుల లెవెల్ నిల్వ చేస్తూ అదనపు నీటిని సముద్రంలోకి విడుదల

    * డెల్టా కాలువలకు పూర్తిగా నీరుని నిలిపివేసిన అధికారులు

    * అల్లూరి జిల్లా: ఎడతెరిపి లేని వర్షాలతో విలీన మండలాలలో ఉప్పొంగుతున్న నదులు

    * చింతూరు వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న శబరి నది

    * కూనవరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కు చేరువగా ప్రవహిస్తున్న గోదావరి

    * రహదారులపైకి వరదనీరు చేరడంతో అనేక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

    * చింతూరు మండలం చట్టి వద్ద ముఫ్ఫై నెంబర్ జాతీయ రహదారి పైకి చేరిన వరదనీరు

    * చత్తీస్‌గఢ్, ఒడిషా వైపు నిలిచిన రాకపోకలు

    * కూనవరం మండలం పోలిపాక వద్ద రహదారి పైకి చేరిన వరద

    * విఆర్ పురం మండలం లో ఉప్పొంగుతున్న వాగులు

    * జల దిగ్బందంలో అనేక గ్రామాలు

    * ముంపు భయంతో సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్తున్న ప్రజలు

    * ఏలూరు పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

    * స్పిల్‌ వే వద్ద 32.910 మీటర్లకు చేరిన నీటిమట్టం

    * స్పిల్ వే నుంచి 10,58,325 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల

    * వరద మరింత పెరిగే అవకాశం

    * గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లకు పోలీసుల సూచన

    * పెద్దపల్లి జిల్లా: పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో సంభించిన బొగ్గు ఉత్పత్తి

    * రామగుండం రీజీయన్‌లో నాలుగు ఓసిపిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

    * క్వారీలో చేరిన వరద నీరు

    * ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం

    * రామగుండంలో 10 కోట్ల రూపాయల నష్టం

    Rainss.jpg

    * హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం

    * GHMC పరిధిలోని 6 జోన్లలో భారీ వర్షం

    * బోయిన్‌పల్లి, సనత్‌నగర్, చింతల్, సచిత్ర, జీడిమెట్ల,..

    * బాలానగర్, అల్వాల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం

    * ఎల్బీనగర్, సికింద్రాబాద్‌, చార్మినార్, ఖైరతాబాద్,..

    * కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్‌లలో కుండపోత వర్షం

    * గ్రేటర్ హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన GHMC

    * రంగంలోకి దిగిన NDRF బృందాలు

    * GHMC టోల్‌ఫ్రీ నెం: 040-21111111, 9000113667

    * రాజమండ్రి దగ్గర గోదావరి వరద ఉధృతి

    * ధవళేశ్వరంలో 12.10 అడుగులకు చేరిన నీటిమట్టం

    * ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    * బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

    * ధవళేశ్వరం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులు

    * సహాయక చర్యల్లో NDRF, SDRF బృందాలు

    * గోదావరి పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

    * రెడ్ అలర్ట్ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

    * భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం

    * మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి

    * భద్రాద్రిలో 50.50 అడుగులు దాటి గోదావరి ప్రవాహం

    * భద్రాద్రిలో 12,86,136 క్యూసెక్కుల వరద ప్రవాహం

    * భద్రాచలం-కొత్తగూడెం రూట్‌లో రోడ్లపైకి వరద నీరు

    * అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్న అధికారులు

    * నిర్మల్: ప్రమాదపు అంచులో కడెం ప్రాజెక్ట్‌

    * ప్రాజెక్ట్‌ కెపాసిటీకి మించి ఎగువ నుంచి భారీగా వరద

    * కడెం ప్రాజెక్ట్‌ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న వ‌ర‌ద‌ నీరు

    * కడెం ఇన్ఫ్లో 3.80 లక్షలు, ఔట్‌ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు

    * కడెం ప్రాజెక్ట్‌ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

    * లోతట్టు గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

    * కడెం ప్రాజెక్ట్‌ దగ్గర హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు

    * ములుగు జిల్లా వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

    * హైదరాబాద్ నుంచి ములుగుకు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు

    * ములుగు గట్టమ్మ జాకారం మధ్యలో వరదలు చిక్కుకుపోయిన బస్సు

    * జాకారం సమీపంలో రోడ్డు నిర్మాణంతో పక్కగా వెట్యండగా భారీ వర్ధకు కొంత దూరం కొట్టుకుపోయిన బస్సు.

    * పొలాల మధ్యలో నిలిచిపోవడం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేక పోతున్న ప్రయాణికులు

    * బస్సులోనే 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

    తమను రక్షించండంటూ అరుస్తున్న ప్రయాణికులు

    * ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

    * ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు మొదలైన ప్రయత్నాలు

    * ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన వరదలు

    * వరంగల్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన వాగులు, వంకలు

    * దాదాపు అన్ని గ్రామాలకు రాకపోకలు బంద్

    * వరంగల్ నగరంలో జలదిగ్బంధంలో 35 కాలనీలు

    * భవనాలపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న జనాలు

    * వరంగల్‌లో రోడ్లపై ఐదారు అడుగుల మేర వరద నీరు

    * వరంగల్‌లో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం

    * భూపాలపల్లి జిల్లాలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతు

    * గ్రేటర్ లో అత్యధికంగా బండ్లగూడలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం

    * కాప్రాలో 5.2 సెంటీమీటర్ల వర్షం, గోల్కొండలో 5.1,

    * శేర్లింగంపల్లిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

  • 2023-07-27T08:40:00+05:30

    తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు (Telugu States) దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి వరంగల్ (Warangal) .. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) వైజాగ్ (Vizag) జిల్లాల్లో గ్యాప్ లేకుండా వానలు కుమ్మేస్తున్నాయి.!. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే.. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో నగర ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచించారు. మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అటు ఏపీలోని పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.