Share News

Revanth Reddy: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ రెడ్డి భేటీ

ABN , First Publish Date - 2023-12-05T23:08:51+05:30 IST

ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి, టీపీసీసీఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Revanth Reddy: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు. ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని వెల్లడించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టు వివరించారు.

తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారని వెల్లడించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపే తీర్మానం మొదటిది కాగా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలుపేది రెండో తీర్మానమన్నారు. ఇక మూడోది అతి ముఖ్యమైనది సీఎల్పీ నేత ఎంపికను అధిష్ఠానానికే వదిలేస్తూ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ఆమోదించారని కేసీ వేణుగోపాల్ వివరించారు. రిపోర్ట్ పరిశీలించిన తర్వాత సీనియర్లతో చర్చించామని, రేవంత్‌ని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు.

Updated Date - 2023-12-05T23:14:23+05:30 IST