Share News

TS Polls : బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కేసీఆర్‌కు రేవంత్ చేసిన సవాల్ ఇదే..

ABN , First Publish Date - 2023-10-15T17:01:38+05:30 IST

కాంగ్రెస్(Congress) పార్టీ చెప్పిన ఎన్నికల హామీలు అమలు చేయదని బీఆర్ఎస్(BRS) చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని.. సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.

TS Polls : బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కేసీఆర్‌కు రేవంత్ చేసిన సవాల్ ఇదే..

హైదరాబాద్: కాంగ్రెస్(Congress) పార్టీ చెప్పిన ఎన్నికల హామీలు అమలు చేయదని బీఆర్ఎస్(BRS) చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని.. సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో(BRS Manifesto) ప్రకటించిన తరువాత దానిపై రేవంత్ స్పందించారు. అధికార పార్టీ మేనిఫెస్టో పూర్తిగా కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తాము ప్రకటించిన ఎన్నికల హామీలు అమలు కావని చెబుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు తమకన్నా కొంచం ఎక్కువే ప్రకటించడంతో కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యమేనని తెలియజేస్తోందని పేర్కొన్నారు.


రేవంత్ ఛాలెంజ్‌..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రెండు ఛాలెంజ్ లు విసిరారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బీఆర్ఎస్ చుక్కా మద్యం పంచదని, డబ్బులు వెదజల్లదని ప్రమాణం చేయగలదా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తే అక్టోబర్ 17న తాను అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని, కేసీఆర్ కూడా వచ్చి అమరుల సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1నే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు వేయగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇండియా కూటమి(INDIA Alliance)లో చేరుతామంటే గేటు కూడా తాకనివ్వలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కొల్లగొడుతున్న సొమ్ముతో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. కేసీఆర్ కు వయస్సు అయిపోయిందని తన సూచనగా ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు రేవంత్ అభినందనలు తెలిపారు. తమ అభ్యర్థులను ప్రకటించే వరకు కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదని అన్నారు. తమ గ్యారంటీ స్కీంలను చేసి కేసీఆర్ కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం పరాన్నజీవిలా మారారని.. కాంగ్రెస్ హామీలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నట్లు రేవంత్ గుర్తు చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్ లో చూపించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని.. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు విమర్శించారు.

Updated Date - 2023-10-15T17:34:33+05:30 IST