Congress Candidates: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా!
ABN , First Publish Date - 2023-09-06T18:18:38+05:30 IST
త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధి విధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధి విధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ (cwc) సమావేశం తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీ ఢిల్లీలో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల జాబితా తయారు చేయంది. అభ్యర్థుల ఎంపికలో విధి విధానాలు ఎలా ఉండాలి? ఎలాంటి అంశాలను ప్రామాణికం చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలనే దానిపై స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాగా అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాలకు కలిపి వెయ్యి మందికి పైగా ఆశావహులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరినీ వడపోసి సరైన అభ్యర్థలను బరిలో నిలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది. మరోవైపు ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా వీలైనంత త్వరగా తమ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమవుతోంది.