Abdullah Sohail: కాంగ్రెస్ పార్టీ RSS చెప్పు చేతుల్లో ఉంది
ABN , First Publish Date - 2023-10-28T20:41:59+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) RSS చెప్పు చేతుల్లో ఉందని తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ ( Abdullah Sohail ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) RSS చెప్పు చేతుల్లో ఉందని తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ ( Sheikh Abdullah Sohail ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఖర్గేకు తన రాజీనామా లెటర్‌ను పంపినట్లు చెప్పారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లా సోహెల్ మాట్లాడుతూ...‘‘34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపకాల్లో గందరగోళంపై పోను పోను హై కమాండ్‌కు తెలుస్తుంది. ఎవరికి అయితే పార్టీ టికెట్స్ కట్టబెట్టిర్రో అందులో 20 శాతం మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది ఒకటి రెండు కాదు అన్ని టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం ఎలాంటి ధర్నాలు, జెండా మోయలేని నేతలు టికెట్స్ పొందారు. RSS నుంచి ABVP నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు’’ అని షేక్ అబ్దుల్లా సోహెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.