Share News

TDP: వైరా కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ మద్దతు

ABN , First Publish Date - 2023-11-15T13:55:05+05:30 IST

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌(Congress) పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాలోత్‌ రాందాస్‌నాయక్‌కు మద్దతు ఇవ్వాలని టీడీపీ(TDP)

TDP: వైరా కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ మద్దతు

- రాందాస్‌ నాయక్‌ విజయానికి కృషి చేస్తాం

- వెంగన్నపాలెం టీడీపీ నాయకుల ఏకగ్రీవ తీర్మానం

జూలూరుపాడు(ఖమ్మం): వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌(Congress) పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాలోత్‌ రాందాస్‌నాయక్‌కు మద్దతు ఇవ్వాలని టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. మంగళవారం మండలంలోని వెంగన్నపాలెం గ్రామంలో ఆ పార్టీ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఎన్నికల్లో ఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలో గ్రామాల వారీగా నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. టీడీపీ శ్రేణులంతా కాంగ్రెస్‌ అభ్యర్థి వైపే మొగ్గు చూపడంతో రాందాస్‌ నాయక్‌కు మద్దతును ప్రకటిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌తో కలిసి పని చేసి రాందాస్‌నాయక్‌ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు ఆరెం రామయ్య, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, వడ్డె వెంకటనారాయణ, రోకటి నరసింహారావు, చల్లమల్ల గోవింద్‌, నాయకులు సాయిన్ని కృష్ణార్జున్‌, చావా వెంకటేశ్వర్లు, గుత్తా రమేష్‌, పొదిల రామారావు, సాయిన్ని నాగేశ్వరరావు, కోటం రాజు, నరేష్‌, ఎన్‌.నాగేశ్వరరావు, కొండలరావు, తిరుమలరావు, వెంకన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

zzz.jpg

Updated Date - 2023-11-15T13:55:06+05:30 IST