హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్‌ రేసు.. విన్నర్‌కు కేటీఆర్ బహుమతి అందజేత

ABN , First Publish Date - 2023-02-11T19:42:49+05:30 IST

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది.

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్‌ రేసు.. విన్నర్‌కు కేటీఆర్ బహుమతి అందజేత

హైదరాబాద్: వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ (KTR) బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్‌ నగరవాసులను విజ్ఞప్తి చేశారు. సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఫార్ములా ఈ రేస్‌ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్‌, మొనాకో, రోమ్‌, లండన్‌, జకార్తా, సియోల్‌ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక మీదట భారతదేశంలో నుంచి హైదరాబాద్‌ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - 2023-02-11T19:42:52+05:30 IST