Share News

Formula E Race: హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా ఇ రేసులో ట్విస్ట్!

ABN , Publish Date - Dec 28 , 2023 | 05:39 PM

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఫార్ములా ఇ రేసు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ఇ రేసు జరుగుతుందా లేదా అని నిర్వహకులతోపాటు పెట్టుబడిదారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Formula E Race: హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా ఇ రేసులో ట్విస్ట్!

తెలంగాణలోని హైదరాబాద్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఫార్ములా ఇ రేస్ విషయంపై సందిగ్ధం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న దీన్ని నిర్వహించడం కష్టంగా కనిపిస్తోందని తెలిసింది. అయితే గతంలో ఫార్ములా ఇ రేసు నిర్వహించడంపై తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌కో మధ్య నాలుగు ఏళ్లకుగాను ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇటివల డిసెంబర్‌ నెలలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో పాత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈసారి అమలు చేయడం కష్టమని తెలుస్తోంది.


అయితే ఫార్ములా E రేస్ నిర్వహణ గురించి ఈ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఆ క్రమంలో నిర్వాహకులు కాంట్రాక్టుకు సంబంధించిన అంశాలను వారికి చెప్పగా వారి నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. ఈ ఈవెంట్‌కు కొన్ని వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్వహకులతోపాటు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిధులు కూడా ప్రభుత్వం అనుమతి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వంద కోట్లకుపైగా ఖర్చు

హైదరాబాద్‌లో గతంలో జరిగిన తొలి రేసులో ఆయా వాటాదారులకు రూ.150 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఇది 2013లో ఫార్ములా 1 నిష్క్రమణ తర్వాత 10 సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన మొదటి FIA వరల్డ్ ఛాంపియన్‌షిప్ స్టేటస్ ఈవెంట్ గా ఇది రికార్డుకెక్కింది. దీని తర్వాత హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా టోక్యో, బెర్లిన్, లండన్‌తో సహా దిగ్గజ ప్రపంచనగరాల సరసన చేరింది.

జరుగుతుందా?

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ పక్కన ఉన్న స్ట్రీట్ సర్క్యూట్‌లో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఆర్గనైజింగ్ టీమ్ ఆగస్టులో రద్దు చేయబడినప్పటికీ, అక్టోబర్‌లో ఎన్నికల కారణంగా ఫార్ములా E రేసును ఫిబ్రవరి 10, 2024న నిర్వహిస్తామని హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో E-Prix 2024లో తిరిగి వస్తుందా లేదా అనే సందేహాం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే క్రిస్మస్ కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడగా..తర్వాత ఏమైనా అవకాశాలు ఉన్నాయో లేదో చూడాలి మరి.

Updated Date - Dec 28 , 2023 | 05:41 PM