Viveka Murder Case : వివేకా హత్యకేసు విచారణలో రెండు కీలక పరిణామాలు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్..
ABN , First Publish Date - 2023-06-02T21:50:41+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని సీబీఐ విచారణ (CBI Enquiry) వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో శుక్రవారం నాడు రెండు కీలక పరిణామాలు (Key Developments) చోటుచేసుకున్నాయి. ఈ కేసులో వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) పిటిషన్‌పై సీబీఐ కోర్టులో (CBI Court) విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలని పిటిషన్‌లో సునీత కోరారు. సునీత పిటిషన్‌పై శివశంకర్ రెడ్డి, ఉమా కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ పిటిషన్‌పై వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ శంకర్ రెడ్డి (Uday Shankar Reddy) కౌంటర్లు దాఖలు చేయలేదు. దీంతో సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ జూన్-05కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
నో కౌంటర్!
మరోవైపు.. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు (Ninhydrin Test) అనుమతించాలన్న పిటిషన్‌పై కూడా శుక్రవారమే సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే.. సీబీఐ పిటిషన్‌పై ఎర్ర గంగిరెడ్డి (Erra Gangi Reddy), సునీల్ యాదవ్ (Sunil Yadav) కౌంటర్లు దాఖలు చేయలేదు. అయితే.. సీబీఐ పిటిషన్‌పై శివశంకర్ రెడ్డి, ఉమా కుమార్‌రెడ్డి మాత్రం అభ్యంతరం తెలిపారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. అయితే సీబీఐ వాదనల కోసం విచారణను జూన్-05కి కోర్టు వాయిదా వేసింది.
గ్రీన్ సిగ్నల్..!
తనకు చంచల్‌గూడ జైలులో (Chanchalguda Jail) ప్రత్యేక కేటగిరీ సౌకర్యాలు కావాలని సీబీఐ కోర్టును వైఎస్ భాస్కర్ రెడ్డి కోరారు. అయితే.. ఈ విజ్ఞప్తిపై కోర్టు స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. కాగా.. వివేకా హత్య కేసులో మే-16 నుంచి చంచల్‌గూడ జైల్‌లో భాస్కర్ రెడ్డి ఉంటున్నారు. అయితే.. తన జీవన శైలి, సామాజిక హోదా, విద్య, ఆదాయపు పన్ను.. వయసు, ఆనారోగ్య పరిస్థితులని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక వసతులు కల్పించమని కోర్టుకు భాస్కర్ రెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు శుక్రవారం నాడు అంగీకరించింది.
మొత్తానికి చూస్తే.. శుక్రవారం ఒక్కరోజే అటు సునీతారెడ్డి పిటిషన్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోనికి తీసుకోవడం.. ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డి విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలపడంతో రెండు కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జూన్-05న సునీత, నిన్‌హైడ్రిన్ పరీక్షకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.