Vijayashanthi: కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది

ABN , First Publish Date - 2023-03-06T23:05:40+05:30 IST

కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విజయశాంతి ధ్వజమెత్తారు.

Vijayashanthi: కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
Vijayashanthi Bandi Sanjay

హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన నిరసన దీక్షలో విజయశాంతి(Vijayashanthi) పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ వద్ద ఈ నిరసన దీక్ష చేపట్టారు. మెడికో ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని విమర్శించారు. ప్రీతి (Preethi) సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేశారని, ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ క్లారిటీ లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి కేసీఆర్‌కు అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana) సాధన లక్ష్యం నెరవేరాలన్నా.. నేరాలు అదుపులోకి రావాలన్నా బీజేపీ (BJP)తోనే సాధ్యమని సంజయ్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ (KCR) పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విజయశాంతి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-07T00:21:24+05:30 IST