Tirumala: తిరుమలలో వికారాబాద్‌వాసి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-05-14T19:55:17+05:30 IST

తిరుమల (Tirumala)లో వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. తిరుమల జీఎన్సీ గేటుకు సమీపంలోని అడవిలో సుమారు...

Tirumala: తిరుమలలో వికారాబాద్‌వాసి ఆత్మహత్య

తిరుమల: తిరుమల (Tirumala)లో వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. తిరుమల జీఎన్సీ గేటుకు సమీపంలోని అడవిలో సుమారు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతోందని ఆదివారం భక్తులు, వ్యాపారుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టూటౌన్‌ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్లాస్టిక్‌ పైపుతో మెడకు చుట్టుకుని చెట్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఇతను వికారాబాద్‌ (Vikarabad)కు చెందిన నరేష్ రెడ్డిగా గుర్తించారు. ఇంట్లో గొడవపడి ఇద్దరి స్నేహితులతో తిరుమలకు వచ్చినట్టు తేలింది. అనంతరం మృతదేహాన్ని స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి, నరే్‌షరెడ్డితో వచ్చిన మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వారిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-05-14T19:55:17+05:30 IST