Viveka Case : నేడు సీబీఐ కోర్టులో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-08-14T11:43:25+05:30 IST
మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన A4 దస్తగిరి మినహా అందరినీ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తదితరులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది. అయితే విచారణకు ముందుగా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన A4 దస్తగిరి మినహా అందరినీ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తదితరులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది. అయితే విచారణకు ముందుగా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో మిగతా నిందితులు లేకపోవడంతో కేసును కోర్టు కాసేపు వాయిదా వేసింది. చంచల్ గూడా జైలు నుంచి సీబీఐ కోర్టుకు సకాలంలో మిగతా నిందితులు చేరుకోలేదు.
కాసేపటి క్రితం నిందితులు చేరుకున్నారు. అయితే భాస్కర్ రెడ్డి ని కోర్టుకి తీసుకొస్తున్నారనే సమాచారంతో భారీగా అనుచరులు కోర్టు వద్దకు చేరుకున్నారు. కోర్టు వద్ద అవినాష్ రెడ్డి, బాస్కర్ రెడ్డిల అనుచరులు హల్‌చల్ చేశారు. నిందితులు వస్తున్న వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించారు. నిందితులు వచ్చిన వెంటనే కేసును విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.