Warangal Dist.: భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్‌లో అసమ్మతి
ABN , First Publish Date - 2023-08-20T10:52:50+05:30 IST
వరంగల్ జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్‌లోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకు టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ గండ్ర వెంకటరమణా రెడ్డికి టికెట్ ఇస్తే... నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్న...
వరంగల్ జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ (BRS)లోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర (Sitting MLA Gandra)కు టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ గండ్ర వెంకటరమణా రెడ్డికి టికెట్ ఇస్తే... నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్న 150 మంది తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే గండ్రపై ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి (Madhusudanachari) వర్గీయులు తిరుగుబాటు చేస్తారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మధుసూదనాచారి ఫాలోవర్స్ సమావేశమై చారి సాబ్‌కే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో గులాబీ బాస్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా సమస్య మరో తలనొప్పిగా మారింది.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు బీఅర్ఎస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ పెద్దల వద్దకు అసమ్మతి పంచాయితీ వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావును బర్తరఫ్ చేయాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఎమ్మేల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దని మున్సిపల్ చైర్మన్ డీవీఆర్ ఇంట్లో అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు.