Share News

Resign to BRS: మూకుమ్మడి రాజీనామాలు.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

ABN , First Publish Date - 2023-10-18T14:59:14+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.

Resign to BRS: మూకుమ్మడి రాజీనామాలు.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

మహబూబాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు (BRS) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా బయ్యారం మండలంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. బయ్యారం మండలానికి చెందిన 9 మంది సర్పంచులు, ఆరుగురు ఉప సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఐదుగురు పీఏసీఎస్ డైరెక్టర్లు, పలువురు వార్డు మెంబర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారందరూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జిన్నా రెడ్డి భరత్ చంద్ర రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

Updated Date - 2023-10-18T14:59:14+05:30 IST