TSPSC పేపర్ లీకేజీ కాదు అదొక మాఫియా: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
ABN , First Publish Date - 2023-04-03T15:25:36+05:30 IST
హనుమకొండ జిల్లా: బీఎస్సీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించారు.
హనుమకొండ జిల్లా: బీఎస్సీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేయూలో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కాదని.. అదొక మాఫియా (Mafia) అని విమర్శించారు. మొదట హ్యాక్ అని.. ఆ తర్వాత హానీ ట్రాప్ జరిగిందని అన్నారన్నారు. మనం విద్యను నమ్ముకుంటే.. బీఆర్ఎస్ వాళ్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
కేయూ వీసీ (KU VC) అధికార పార్టీకి తొత్తుగా మారిపోయారని, యూనివర్సిటీని కాపాడడం కోసం విద్యార్థులు మీటింగ్ పెడితే అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. తాను బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడకు రాలేదని.. ఒక పూర్వ విద్యార్థిగా, మాజీ ఐపీఎస్ అధికారిగా వచ్చానన్నారు. సీఎం అసమర్థత వల్లే పేపర్ లీకేజీలు (Paper Leakage) అవుతున్నాయన్నారు. ముందు కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), జనార్దన్ రెడ్డి (Janardhan Reddy)లు వారి పదవులకు రాజీనామాలు చేయాలని... ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్బుల్లో తాగి పడుకునే కేటీఆర్‌కు నిరుద్యోగుల కష్టాలు పట్టవని ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.