janagama: భార్య మరణం తట్టుకోలేక..పోలీసుల ముందే రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై
ABN , First Publish Date - 2023-04-06T11:25:53+05:30 IST
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు(husband and wife) ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం
జనగామ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు(husband and wife) ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టౌన్ పోలీస్ స్టేషన్లో(Town Police Station) విధులు నిర్వహిస్తున్న ఎస్సై కాసర్ల శ్రీనివాస్(Srinivas) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోయిందని ఎస్ఐ(SI) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మొదటి భార్య స్వరూప(Swaroopa) ఇంట్లో బాతు రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా..రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే..ఎస్సై ఆత్మహత్యకు ముందు దంపతుల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తీవ్రమనస్థానికి గురైన శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూంలో సూసైడ్ చేసుకుంది. దీంతో తీవ్రమైన మనోవేదనకు గురైన ఎస్సై శ్రీనివాస్ పోలీసులు ఇంట్లో ఉండగానే..రివాల్వర్‌తో(Revolver) కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనలు జనగామలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.