sad incident: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. AR SI సూసైడ్

ABN , First Publish Date - 2023-09-19T21:58:02+05:30 IST

జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఉరివేసుకుని ఏఆర్ ఎస్ఐ (AR SI) శోభన్‌బాబు మృతి చెందాడు. ఈఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గంగారం మండలం బావురుగొండ గ్రామంలో జరిగింది.

sad incident: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. AR SI సూసైడ్

మహబూబాబాద్: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఉరివేసుకుని ఏఆర్ ఎస్ఐ (AR SI) శోభన్‌బాబు మృతి చెందాడు. ఈఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గంగారం మండలం బావురుగొండ గ్రామంలో జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల(Health problems)తో శోభన్‌బాబు ఇబ్బంది పడుతున్నారు.మెడికల్ లీవ్‌లో నిన్న సొంతూరుకు వచ్చి అనారోగ్య సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి బెటాలియన్‌(Satthupalli Battalion)లో ఏఆర్ ఎస్ఐగా శోభన్‌బాబు(Shobhan Babu) పనిచేస్తున్నారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శోభన్‌బాబు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందరితో స్నేహంగా ఉండే శోభన్‌బాబు మృతిని తనతో చేసే సిబ్బంది, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated Date - 2023-09-19T21:58:02+05:30 IST